ఎంజేపీ బీసీ మహిళా వ్యవసాయ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు
Sun 27 Nov 04:43:01.732127 2022
- డిసెంబర్ 5లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి : డాక్టర్ మల్లయ్య బట్టు నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ మహాత్మా జ్యోతిభా పూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మహాత్మా జ్యోతిభా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంసెట్, అగ్రిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన తెలిపారు.