నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ వైఎస్సాఆర్టీ అధినేత వై.ఎస్.షర్మిల తెలంగాణ ప్రజలు వదిలిన బాణమని ఆ పార్టీ నేత గట్టురామచంద్రారావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. షర్మిలపై దాడి, అరెస్టును దాడిని ఖండించారు. హిట్లర్ వంటి వ్యక్తులనే ప్రజల నలిపేశారని గుర్తు చేశారు. షర్మిలకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే దాడులు చేశారని విమర్శించారు.