- ఇద్దరు నిందితుల అరెస్ట్ నవతెలంగాణ-కోహెడ సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో ఇద్దరు యువకులు బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తమ తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా బాలికను ఇద్దరు యువకులు లైంగికంగా వేధించారని సమాచారం. నిర్భయ కేసులు నమోదవుతున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.