నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : వరంగల్ పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రంగనాథ్ హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రస్తుత వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కాగా, తరుణ్ జోషిని ఆకస్మికంగా బదిలీ చేయటంపై పోలీసు వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది.