- నూతన కార్యవర్గం ఎన్నిక నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో తెలంగాణ అడ్వొకేట్స్ నోటరీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, అడ్వొకేట్ మయబ్రహ్మ నర్సింహా కార్యాలయంలో గౌరవాధ్యక్షులు గోలి దేవేందర్‌బాబు అధ్యక్షతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా మాజీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వినాయకరావు వ్యవహరించారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా మాజీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గంజి యాదగిరి, మయబ్రహ్మ నర్సింహా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అనిల్‌కుమార్, జే సుదర్శనాచారి, ఎమ్‌ఎస్ ప్రభాకర్, లేడీ సెక్రటరీగా ఉమాదేవి, కోశాధికారిగా ఏబీ నర్సింగరావు ఎన్నికయ్యారు. వారితో పాటు నలుగురు సహాయ కార్యదర్శులు, నలుగురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, పదిమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.