నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సుదీర్ఘంగా విచారించారు. లైగర్ సినిమా నిర్మాణంలో మనీలాండరింగ్ (పీఎంఎల్‌ఏ) ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఈడీ అధికారులు విజయ్‌ను విచారించారు. ఇంతకముందు దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మీ లను ఈడీ అధికారులు ఇవే ఆరోపణలపై విచారించిన విషయం తెలిసిందే. కాగా, విదేశాల్లో లైగర్ సినిమా చిత్రీకరణ సందర్భంగా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించారనీ, ఆ డబ్బులను ఏ విధంగా సమకూర్చారు? అందుకు ప్రభుత్వపరమైన పీఎంఎల్‌ఏ నిబంధనలను అనుసరించారా? లేదా? తదితర కోణాల్లో విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధానంగా లైగర్ సినిమా నిర్మాణంలో కొందరు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారనే అనుమానాలను కూడా విజయ్ దేవరకొండ నుంచి నివృత్తి చేసుకోవటానికి ప్రయత్నించారని సమాచారం.