నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో మహేశ్వరం మండలం రావిర్యాల పెద్ద చెరువు ఆక్రమణలపై సర్వే చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, హెచ్‌ఎండీఏ ఆఫీసర్లతో సర్వే చేయించిన రిపోర్టును జనవరి 27న జరిగే విచారణ నాటికి అందజేయాలని పేర్కొన్నది. చెరువు కబ్జాపై అంజయ్యగౌడ్ ఇతరులు 2016లో వేసిన పిల్‌ను శుక్రవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లల్లో కబ్జా చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పిటిషనర్ పిల్‌లో పేర్కొన్నారు.