Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
తొలిమెట్టు 'టాస్క్‌ఫోర్స్‌'పై సర్కారు వెనక్కి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

తొలిమెట్టు 'టాస్క్‌ఫోర్స్‌'పై సర్కారు వెనక్కి

Sun 04 Dec 04:43:14.989313 2022

- ఉత్తర్వులు నిలిపివేత
- విద్యాశాఖ ఆదేశాలు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
          ప్రాథమిక స్థాయిలో మౌలిక భాషాగణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం (ఎఫ్‌ఎల్‌ఎన్‌) తొలిమెట్టు పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ నిలిపేసింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. తొలిమెట్టు పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ గతనెల 19న ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
          దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పించకుండా, సకాలంలో పాఠ్యపుస్తకాలను ఇవ్వకుండా, విద్యా వాలంటీర్లను నియమించకుండా తొలిమెట్టు కార్యక్రమం అమలు ఎలా సాధ్యమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టాస్క్‌ఫోర్స్‌ను తొలగిం చాలంటూ పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. లేకుంటే ఉద్యమించాల్సి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను హెచ్చరించారు. ఎట్టకేల కు విద్యాశాఖ అధికారులు స్పందించి తొలిమెట్టు అమలు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ను నిలిపేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.
టాస్క్‌ఫోర్స్‌ పదాన్ని తొలగించాలి : టీఎస్‌యూటీఎఫ్‌
          తొలిమెట్టు అమలు కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పదాన్ని తొలగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పర్యవేక్షణ కమిటీలో ఎన్జీవోలను తొలగించాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ అనేది పోలీసు వ్యవస్థలో కొనసాగుతున్నదనీ, విద్యావ్యవస్థలోకి తేవడం అభ్యంతరకరమని వివరించారు. పాఠ్యప్రణాళిక స్థానంలో టీచింగ్‌ నోట్స్‌కు అవకాశమివ్వాలని పేర్కొన్నారు. బోధనేతర పనిభారాన్ని తగ్గించి అవసరమైన చోట విద్యావాలంటీర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారుల ముందు ఉపాధ్యాయులను పాఠం చెప్పమనే భయానక వాతావరణాన్ని మినహాయించాలని కోరారు. పీరియెడ్‌ పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. కనీస సామర్థ్యాలు లేదా సిలబస్‌ చెప్పాలనే స్పష్టత ఇవ్వాలని తెలిపారు. అభ్యసన సామర్థ్యాల్ని పరీక్షించే సమయంలో కేవలం విద్యార్థులను మాత్రమే పరిశీలించాలని పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ విజయవంతం కోసం ఉపాధ్యాయులపై పనిభారంతోపాటు మానసిక ఆందోళనలు తగ్గించి ప్రశాంత వాతావరణంలో బోధన సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేయాలి : టీఎస్‌పీటీఏ
          ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఉత్తర్వులను నిలిపేయడం సమంజసం కాదనీ, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని టీఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, పిట్ల రాజయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
          రాష్ట్రంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా, కనీసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్న నైతిక బాధ్యతను కూడా విస్మరించారని విమర్శించారు. గడిచిన రెండేండ్లుగా ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేసి విద్యాశాఖలో సంక్షోభం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్థిక వ్యవస్థలో.. విప్లవాత్మక సంస్కరణలు
వ్యాపారంగా విద్య
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి
కుల గణన చేపట్టాలి
నేడే రాష్ట్ర పద్దు
భద్రాచలం కాకుండా ములుగే ఎందుకు?
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే...
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని రక్షించాలి
పత్తికి మద్దతు ధర కల్పించాలి
మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో.. శనగలు కొనుగోలు చేస్తాం
బదిలీలు చేపట్టండి
వైద్య పరంగా తీసుకునే నిర్ణయాల్లో.. ఐఎంఏను ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి
వీఆర్‌ఏలకు సీఎం శుభవార్త చెప్తారు
ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ. 6వేల కోట్లు కేటాయించాలి
రైతుల ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి :పాకాల
నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభతుస్సుమంది : బండి
మంత్రుల చేతుల మీదుగా బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
వాణి జయరాం మృతి సంగీత, సాహిత్య రంగాలకు తీరని లోటు
రైతు బంధు ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు
నిరసనలు జయప్రదం చేయండి
భూపాలపల్లిలో.. 'మేడారం జాతర'...
నిర్మలా సీతారామన్‌కు గవర్నర్‌ శుభాకాంక్షలు
పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం
ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఊహాజనితం
వర్గ పోరాటాల కేంద్రంగా సీఐటీయూ కార్యాలయం
రైతు రాజ్యం రావాలే..!
దేశాభివృద్ధికి ప్రజారవాణా జీవనాడి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏమైంది?
మూగబోయిన సుమధురవాణి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.