Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బీజేపీ ఖాళీలు నింపదు...కనీస వేతనాలు అమలు చేయదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

బీజేపీ ఖాళీలు నింపదు...కనీస వేతనాలు అమలు చేయదు

Mon 05 Dec 02:41:44.798363 2022

- బండిసంజయ్‌కి ప్రశ్నించే నైతిక అర్హత లేదు
- కేరళ సర్కారు పాలనలో కనీస వేతనాల అమలు
- సీఐటీయూకే ప్రశ్నించే హక్కు ఉంది...: టీయుఎంహెచ్‌ఇయూ మహాసభలో జె.వెంకటేష్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
''కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు పోస్టుల ఖాళీలను భర్తీ చేయదు. కనీస వేతనాలను డిమాండ్‌ చేస్తున్న అమలు చేయదు. కార్మిక హక్కులను హరిస్తూ నాలుగు కోడ్లను తెస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నది. రాష్ట్ర విభజన హామీల అమలును పట్టించుకోదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖాళీలు భర్తీ చేయరెందుకని ప్రశ్నిస్తుంటారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారును ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది. కేరళలోని ఎర్రజెండా సర్కారు రూ.18 వేల కనీస వేతనాలను అమలు చేస్తున్నది. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చేలా చట్టాన్ని రూపొందించే పనిలో ఉన్నది. చివరకు అగ్నిపథ్‌ పేరుతో సైన్యంలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను తెచ్చిన ఘనత బీజేపీదని అన్నారు. అందుకే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించే అర్హత తమకే ఉందని''.... సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్‌ అద్యక్షతన మూడో మహాసభ నిర్వహించారు. ఈ సభను వెంకటేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో కనీసం ఆరు శాతం కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కనీసం ఒక శాతం కేటాయించలేదని విమర్శించారు. బీజేపీ హిందుత్వ పేరుతో విభజన రాజకీయాలు చేస్తూ, ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఆ పార్టీ దృష్టిలో హిందువులందరు సమానం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం పోరాడాల్సిన అవసరమున్నదని చెప్పారు. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను టీఆర్‌ఎస్‌ సర్కారు పెంచడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ యాజమాన్యాల పక్షమా? లేక కార్మికుల పక్షమా? నిర్ణయించుకోవాలని తెలిపారు. వైద్యారోగ్యరంగ సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాలేదన్నారు. ఇది పోరాటానికి అనుకూల సమయమనీ, ఆ మేరకు ఉద్యోగులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
హైకోర్టు అడ్వొకేట్‌ మూర్తి మాట్లాడుతూ రెగ్యులరైజేషన్‌కు సంబంధించి చట్టపరమైన అంశాలు, కోర్టుల తీర్పులను వివరించారు. పదేండ్లు పని చేసిన వారిని పర్మినెంట్‌గానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం పోరాటాలు చేయాలనీ, చివరి అస్త్రంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. హైకోర్టు అడ్వొకేట్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో యూనియన్‌ అధ్యక్షురాలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌.రోజారాణి మాట్లాడుతూ పోరాటాలు వృధా పోవనీ, ఫలితాలిస్తాయని తెలిపారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో యూనియన్‌ ఏర్పాటై ఏడాది కాలమే అయినా 10 మందికి పైగా ఉద్యోగులకు లేబర్‌ కోర్టు వరకు వెళ్లి ఉద్యోగ భద్రత కల్పించిదని గుర్తుచేశారు. ఐక్యంగా ఉంటూ, మహిళలు యూనియన్‌లో నిర్ణయాత్మక కమిటీలలో బాధ్యతలు చేపట్టాలని సూచించారు.
యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ తీర్మానాలను ప్రవేశపెట్టారు. కాంట్రాక్ట్‌ పారామెడికల్‌, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ఎలాంటి షరతులేకుండా యధావిధిగా రెగ్యులరైజ్‌ చేయాలి. ఇందు కోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలి. పని ఒత్తిడి తగ్గించాలి. సెలవు దినాల్లో పని చెప్పకూడదు. సీపీఎస్‌ ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి. వేతన సవరణకమిటీని నియమించి జూలై ఒకటి నుంచి రెండో పీఆర్‌సీని అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 240 రోజులివ్వాలని మహాసభ తీర్మానించింది. ఈ మహాసభలో యూనియన కోశాధికారి మహమ్మద్‌ ఫసియుద్దీన్‌, నాయకులు మరియమ్మ, కవిత, బలరాం, సుధాకర్‌, సంజూ జార్జ్‌, వీరయ్య, వెంకటేష్‌, మీనా, శ్రావణ్‌ కుమార్‌, కుమారస్వామి, చంద్రమోహన్‌, రాజు, శ్రీనివాస్‌, భాస్కర్‌, నవీన్‌ కుమార్‌, విజయలక్ష్మి, సరోజన, విజయవర్థన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
టీవీవీపీలో జీ.వో.317 అమలుకు అనుమతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.