నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవడమేంటని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇప్పటికే మూడుసార్లు తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పాదయాత్రకు వస్తున్న జనాదరణ చూసి .. కేసీఆర్ ఓర్వలేక పోలీసుల ద్వారా తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. మంత్రులే బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో అవినీతి జరుగుతున్నదని వివరించారు. తాను చేస్తున్న ఆరోపణలపై బహిరంగ విచారణకు సిద్దమా? అని సవాల్ విసిరారు.