- గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ నవతెలంగాణ-దామెర గ్రీన్‌ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఐదు జిల్లాల గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధిత రైతులు వరంగల్ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారి 163ని దిగ్బంధించి భారీఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఊరుకొండ నుంచి మొగుళ్ళపల్లి వయా టేకుమట్ల, పెద్దపల్లి జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోని నార్వ వరకు, ఇటు విజయవాడ వరకు నిర్మించాలని ఉంది. దీనికి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా నేషనల్ హైవే అధికారులు చట్ట విరుద్ధంగా బిడ్డింగ్ వేసి టెండర్లను పిలవడాన్ని నిరసిస్తూ ఖమ్మం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన రైతులు ఊరుకొండ వద్ద నేషనల్ హైవేను దిగ్బంధించారు.