Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
డబుల్‌ ఇంజన్‌ అంటే..కార్పొరేట్‌, ప్రభుత్వం కలిసి దోచుకోవడమే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

డబుల్‌ ఇంజన్‌ అంటే..కార్పొరేట్‌, ప్రభుత్వం కలిసి దోచుకోవడమే

Mon 05 Dec 03:49:58.468284 2022

- వేతనాలు, చట్టాల కోసం పోరాటాలు
- కార్మికులతో వెట్టి చేయిస్తున్న పాలకులు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
           అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ శక్తులు, మోడీ, అమిత్‌షా లాంటి ప్రభుత్వ శక్తులు కలిసి దోచుకోవడమే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉద్దేశమని, ఈ రెండు శక్తులు కలిసి దేశాన్ని సర్వ నాశనం చేస్తూ... ఒకే జెండా, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే చట్టం, ఒకే మతం.. అంటూ బీజేపీ దేశం మీదపడి కాలకేయుళ్లా దాడి చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ (సున్నం రాజయ్య నగర్‌) లో జరిగిన తెలంగాణ మిషన్‌ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయూస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభకు ఆయన హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ముందుగా సంఘం జెండాను యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జంజిరాల శ్రీనివాస్‌ ఎగరవేశారు. అనంతరం జరిగిన సభలో జూలకంటి మాట్లాడుతూ.. అందరి కంటే ఎక్కువ కష్టపడి సంపదను సృష్టిస్తున్న రైతులు, కార్మికులు ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తుంటే, ఏ కష్టమూ చేయని కార్పొరేట్‌ శక్తులు మాత్రం దేశ సంపదనంతా దోచుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా మోడీ అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని యువతను మోసం చేశారని, నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మాట నీటి మూటైందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. నల్ల చట్టాలను రైతులు పోరాడి వెనక్కు కొట్టినట్లుగానే కార్మికులు కూడా సంఘటితంగా పోరాడి లేబర్‌ కోడ్లను తిప్పికొట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో రూ.36 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మిషన్‌ భగీరథ పథకంలో 15 వేల మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు కూడా అంతే గొప్పగా ఉండే విధంగా వారికి కనీస వేతనాలివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాలు వేసిన కమిటీలే ఒక కుటుంబం గడవడానికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం సరైంది కాదని చెప్పారు. రోజుకు 12 గంటల పాటు దూర ప్రాంతాలకెళ్లి పనిచేస్తున్న మిషన్‌ భగీరథ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరేడు వేల జీతమిచ్చి కంపెనీలు దోపిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు కంపెనీలు ఇష్టమొచ్చిన రీతిన వేతనాలిచ్చి కార్మికుల్ని దోచుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమే అవుతుందన్నారు. చట్టబద్దమైన సదుపాయాలు, కనీస వేతనాల కోసం కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు. కార్మికుల పక్షాన ఎర్రజెండా, సీఐటీయూ జెండా ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.
యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 12 గంటల పనివిధానాన్ని తెస్తుందని విమర్శించారు. లేబర్‌ కోడ్ల వల్ల కంపెనీలు, కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూరుతుందన్నారు. కార్మికులకు కనీసం యూనియన్‌ పెట్టుకునే హక్కు లేకుండా మోడీ ప్రభుత్వం చేస్తున్నాదన్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించి కార్మిక చట్టాలను కాపాడుకోవాలన్నారు. సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ కార్మికులది 'ఎక్కువ కష్టం తక్కువ జీతం' అన్నారు. మెగా, రాఘవ, కేఎల్‌ఎస్‌ఆర్‌ వంటి కాంట్రాక్టు కంపెనీలు భగీరథ కార్మికులతో 12 గంటల పాటు పనిచేయిస్తూ రూ.8 వేలకు మించి జీతాలివ్వట్లేదన్నారు. మహాసభలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జంజిరాల శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు సుధాకర్‌, వెంకన్న, రాములు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.