Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి

Sat 28 Jan 03:05:19.517676 2023

- ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణకు నిధులు కేటాయించాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
                రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ రకాల పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు తక్కువ జీతాలను చెల్లిస్తున్నారని తెలిపారు. వారికి 2020 పేస్కేళ్లలోని కనీస మూలవేతనం చెల్లించేందుకు వీలుగా 2023-24 బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరారు. కేజీబీవీల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు, కొన్నింటిలో ఇంటర్‌ తరగతులనూ నిర్వహిస్తున్నారని వివరించారు. సర్కారు బడుల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ వేతనం రూ.42,300 నుంచి రూ.1.15 లక్షల వరకు ఉందని తెలిపారు. కానీ కేజీబీవీ టీచర్లకు రూ.26 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టు కనీస మూలవేతనం రూ.42,300 చెల్లించాల్సి ఉందని వివరించారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు ఇంటి అద్దె భత్యం, కరువు భత్యం అదనంగా ఉంటాయని తెలిపారు. ఆరు నుంచి పదో తరగతికి బోధన చేసే టీచర్‌ను రెగ్యులర్‌గా నియమిస్తే ప్రభుత్వం రూ.53,742 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ కేజీబీవీలో పనిచేస్తున్న వారికి రూ.26 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నదని వివరించారు. వారికి కనీస మూలవేతనం రూ.42,300 చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచిన సందర్భంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకిచ్చే వేతనాన్ని పెంచేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయాలని కోరారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిర్వహణ మెరుగుదలకు 2022-23 బడ్జెట్‌ కంటే 50 శాతం అదనంగా వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదించాలని సూచించారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసు పనులను, గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు చేయలేకపోతున్నాయని వివరించారు.
వచ్చే బడ్జెట్‌లో వాటి నిర్వహణలో భాగంగా సర్వీసు పర్సన్ల నియామకం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూళ్లను నిర్మించి పదేండ్లయ్యిందనీ, వాటి భవనాల రంగు వెలసిపోయాయని తెలిపారు. ఆయా భవనాలకు రంగులు వేసేందుకు, మరమ్మతుల కోసం అదనపు బడ్జెట్‌ కేటాయించాలని పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంట్రాక్టు జేఎల్‌ల ఫిబ్రవరి వేతనాలు విడుదల
కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ము 'సిట్‌'కు ఉందా? : బండి
ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లోకి రూ.217 కోట్లు
సేవా కార్యక్రమాల్లో...రాజ్‌ భవన్‌తో కలసి రండి : గవర్నర్‌
ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించాలి
రైతుల పేరిట రాజకీయం వద్దు:సింగిరెడ్డి
బీజేపీవి బరితెగింపు దాడులు
హిందూ మతానికి బీజేపీకి సంబంధం లేదు
మన భూములపై అదానీ కార్పొరూట్‌
ఎర్ర బంగారం రికార్డ్‌ బ్రేక్‌
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.