Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా

Sat 28 Jan 03:40:40.124315 2023

- వచ్చే నెల 3న అధికారులకు వినతిపత్రాలు
- సొంత జాగా ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి
- రాష్ట్ర బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించాలి : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలను కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌ లోని గోల్కొండ చౌరస్తాలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వేలాది మంది పేదలు ఇండ్ల స్థలాల కోసం గత ఆర్నెల్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారని చెప్పారు. అధికారులు, పోలీసులు వారిపై దాడి చేసి గుడిసెలను తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రౌడీలతో బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములున్నా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదనీ, అవి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపరం అవుతున్నాయని విమర్శించారు. గుడిసెలు వేసుకున్న వారందరికీ అక్కడే ఇంటి స్థలాల పట్టా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూమి లేక కాదనీ, రాష్ట్ర ప్రభుత్వానికి మనసు లేకే ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం లక్షలాది మంది దరఖాస్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లను పూర్తిస్థాయిలో కట్టలేదనీ, పూర్తయిన వాటినీ లబ్దిదారులకు కేటాయించక పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. వాటి నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ తక్షణం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ప్రకటించాలని చెప్పారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వారంరోజులపాటు సర్వేలు, దరఖాస్తులు సమ ర్పించాలని నిర్ణయించామని వివరించారు. వచ్చే నెల మూడో తేదీన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పి స్తామని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి మాట్లాడుతూ 22 జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారని వివరించారు. ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షలతోపాటు కేంద్రం కూడా రూ.ఐదు లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు. పట్టణ ప్రాంతాల్లో సొంత ఇండ్లు లేక అసంఘటిత కార్మికులు, పేదలు, మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 58 జీవో ప్రకారం 120 గజాల్లోపు ఉన్న ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని సూచించారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ నాయక్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరామ్‌ నాయక్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవి రమణ, కో కన్వీనర్‌ పి ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.