Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...

Sun 29 Jan 04:26:46.729322 2023

- వారందరి గురించి నేటి తరం తెలుసుకోవాలి : పాలగుమ్మి సాయినాథ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             బ్రిటీష్‌ సామ్రాజ్యవాద వలస పాలన నుంచి దేశ విముక్తి కోసం ఎంతో మంది సామాన్యులు పోరాడారని ప్రముఖ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ' హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ' కోర్‌ కమిటీ సభ్యురాలు సునీతా రెడ్డి, సాయినాథ్‌ రచించిన ది లాస్ట్‌ హీరోస్‌ ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం పుస్తక విశేషాలపై ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహౌత్స వాలను నిర్వహించిందనీ, అయితే ఆ కార్యక్రమం ద్వారా నేటి తరానికి స్వాతంత్య్ర సమరయోధుల గురించి అవగాహన కల్పించలేకపోయిందని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు, మల్లు స్వరాజ్యం వంటి వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధీరోదాత్తమైన పోరాటాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. ఒరిస్సా బార్గా జిల్లా పానీమోరా ప్రాంతంలో 42 మంది సామాన్యులు పోరాడారని గుర్తుచేశారు. మల్లు స్వరాజ్యం లాంటి వారు తుపాకులు పట్టి పోరాటం నిర్వహించారనీ, ఆమె రజాకార్లకు ధీటుగా నిలబడిన వీరవనిత అని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటం పిడికెడు మందికి పరిమితమైంది కాదనీ, రైతులు, కూలీలు, గృహిణులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ వారు సైతం తమ తమ పరిధుల్లో బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డారని తెలిపారు. గాంధీయన్లతో పాటు వామపక్షవాదులు, అంబేద్కరిస్టులు, ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు, బ్రాహ్మణులు, ముస్లీంలు, సిక్కులు, హిందువులు పోరాటంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. 1947 తర్వాత తరానికి ఈ వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన తరంలో ఇప్పుడు కొద్ది మంది మాత్రమే మిగిలారనీ, వారంతా ఐదారు సంవత్సరాల కన్నా ఎక్కువగా బతికే అవకాశం లేదని చెప్పారు. ఆజాదీ అని నినదించినందుకు ఐదుగురు విద్యార్థులను ఏడాది పాటు జైలుకు పంపిన కేంద్రంలోని బీజేపీ సర్కారు 'ఆజాదీ' అనేది తమ ఆస్తి అయినట్టు ఉత్సవాలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. దామోదర వినాయక సావర్కర్‌ జైలుకెళ్లేంత వరకూ విప్లవ భావాలు కలిగే ఉన్నారనీ, అనంతరం బ్రిటీష్‌ ప్రభుత్వంతో రాజీ పడ్డారని తెలిపారు. తనను క్షమిస్తే తప్పుదోవ పట్టిన యువతను తిరిగి బ్రిటీష్‌ వారికి అనుకూలంగా నడిపిస్తానంటూ నాటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సావర్కర్‌ రాసిన ఏడు ఉత్తరాల్లో ఐదు ఉత్తరాలు నేషనల్‌ ఆర్కైవ్‌లో ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పోరాడిన వారిని పట్టుకున్న పోలీసులకు పేర్లు చెప్పేందుకు నిరాకరిస్తే వారి పేర్లను ఎ, బీ, సీ, డీగా రాసుకున్నారనీ, వారిని జైలులో ఉంచేందుకు జైలరు కూడా అనుమతించలేదని వివరించారు.. ప్రజలు తమ చరిత్రను తాము చదువుకోవాలనీ, నిజమైన చరిత్రను తెలుసుకునేందుకు స్వాతంత్య్ర సమరయోధులను కలుసుకుని వారితో ముచ్చటించాలని సూచించారు. ఆ పోరాట వాస్తవ చరిత్రను చెప్పేందుకే తాను పుస్తకం రాసినట్టు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.