నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో ఛత్తీస్‌ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఆయన తన పార్టీ ముఖ్యనాయకులతో కలిసి బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చారు. దేశ రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. బీఆర్‌ఎస్ విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం వున్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమం, అభివద్ధి పథకాలను ప్రసంసించారు. ఈ సందర్భంగా తన తండ్రి ఛత్తీస్‌ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని సీఎం కేసీఆర్‌కు అందచేశారు. జనతా కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.