Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే ! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !

Thu 02 Feb 03:37:55.98592 2023

- రాష్ట్ర ప్రాజెక్టులకు మొండిచేయి 
- నిర్మల పద్దుపై నిపుణుల పెదవి విరుపు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
అనుకున్నంతా అయింది. మరోసారి అదే జరిగింది. కావాలనే చేసింది. తెలంగాణను ఎండబెట్టేందుకు మోడీ సర్కార్‌ బడ్జెట్‌ను ఆయుధంగా చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే, కేంద్రం మరోకటి చేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు ఇంకోసారి మొండిచేయి చూపింది. రిక్తహస్తాలనే మిగిల్చింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు దాదాపు మూడేండ్లుగా సీఎం కేసీఆర్‌ సర్కారు అడుగుతున్న జాతీయ హోదా సంగతి పట్టించుకోలేదు. కాగా పక్కనున్న కర్నాటకలోని అప్పర్‌ భద్ర డ్యామకు జాతీయ హోదాను కట్టబెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా ఈ పనికి పూనుకుంది. అంతేగాక వేగవంతమైన సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) నిధులకూ కోతపెట్టింది. యూపీఏ కాలం నుంచి కొనసాగుతున్న ఈ నిధులను 50 శాతం వరకు గత బడ్జెట్‌ నుంచే తగ్గిస్తూ వస్తున్నది. దీనిపై సర్కారుతోపాటు సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఏఐబీపీ ద్వారా భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని దాదాపుగా నీరుగార్చింది. 1996-97లో యూఏపీ సర్కారు ఏఐబీపీ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులు వచ్చాయి. ఇందులో నాలుగు భారీ ప్రాజెక్టులు కాగా, ఏడు చిన్న తరహావి. దాదాపు రూ. 4,516.19 కోట్లు వచ్చాయి. 2005-06లో మాత్రం రూ.11,485.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆ తర్వాత రూ.21,683.14 కోట్లుగా సవరించింది. కాగా తాజా బడ్జెట్‌లో ఏఐబీపీ నిధు లను రాష్ట్రానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టులు పూర్తికావాలంటే దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు కావాల్సిందే. ఈ నిధుల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం పదే పదే విన్నవించినా, లేఖలు రాసినా అలక్ష్యం చేస్తున్నది.
భగీరథకూ గుండుసున్న
ఇదిలావుండగా దేశంలో ఆదర్శ తాగునీటి పథకంగా పదే పదే ప్రశంసి స్తున్న మిషన్‌ భగీరథ పథకానికీ కేంద్రం నిధులు ఇవ్వలేదు. 2018లోనే నిటి అయోగ్‌ చేసిన సిఫారసులనూ తాజా బడ్జెట్‌లోనూ నిర్లక్ష్యం చేసింది. కేంద్రం లోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజ నాలు చూడటం మినహా రాష్ట్రాల సంక్షే మానికి పట్టించుకోకపోవడం తెలిసిందే.
జాతీయ రహదారులనూ మరిచింది
రాష్ట్రానికి గత ఏనిమిదేండ్ల కాలంలో జాతీయ రహదారులకు కేంద్రం రూ.1.25 లక్షల కోట్లను కేటాయించింది. కానీ, ఖర్చు చేసింది మాత్రం రూ. 18 వేల కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. లక్ష కోట్లకుపైగా నిధులు ఇవ్వాల్సి ఉంది. దీంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు వస్తాయని భావించిన కేసీఆర్‌ సర్కారు ఆశలపై నీళ్లు చల్లింది.
మాటలే..చేతల్లేవ్‌: మంత్రి వేముల
రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తప్పుబట్టారు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడపదాటం లేదు. ప్రయివేటు రంగాన్ని ప్రొత్సహిస్తారా ? నిధులు కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏండ్ల తరబడి వివక్ష చూపుతున్నారు.
ఎన్నికల బడ్జెట్‌ : చేవెళ్ల ఎంపీ రంజీత్‌రెడ్డి
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో మోడీ ప్రభుత్వం వివక్ష చూపింది. ఎన్నికలు ఉన్నాయనే పేరుతో కర్నాటకలోని అప్పర్‌ భద్ర డ్యాంకు జాతీయ హోదా ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఏమాత్రం నిధులు ఇవ్వలేదు. రైతులకూ అన్యాయం చేసింది. పార్లమెంటులో పోరాడుతాం. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడతాం.
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం: సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరి గింది, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఏఐ బీపీ నిధులనూ తగ్గిస్తూ వస్తున్నది. నిర్మిలా సీతారామన్‌ బడ్జెట్‌ కార్పో రేట్లకే తప్ప, ప్రజలకు కాదన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.