Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మూగబోయిన సుమధురవాణి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

మూగబోయిన సుమధురవాణి

Sun 05 Feb 03:50:21.400333 2023

- 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు
- ఉత్తమ గాయనిగా మూడు జాతీయ అవార్డులు
- వాణీజయరాంకు ఇటీవలే పద్మభూషణ్‌ ప్రకటించిన కేంద్రం
- మతిపై అనుమానాలు?
హైదరాబాద్‌: దిగ్దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణ విషాదం నుంచి తేరుకోకముందే మరో గొప్ప గాయనిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. గత ఐదు దశాబ్దాలుగా తన సుమధుర గానంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ప్రముఖ గాయని వాణీజయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగమ్‌బక్కమ్‌లో ఉన్న తన నివాసంలో శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్టు బంధువులు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు వసంత్‌దేశారు సహకారంతో 'గుడ్డి' సినిమాలోని 'బోలో రే పపి హరా..' పాటతో ఆమె సినీ గాన ప్రస్థానం మొదలైంది. అనతికాలంలోనే బాలీవుడ్‌లో అగ్ర గాయనిగా నిలిచిన ఆమె హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ, తులు, భోజ్‌పురి.. ఇలా 19 భాషల్లో దాదాపు 20 వేలకు పైగా భిన్న పాటలతో అలరించారు. ఏ భాషలోనైనా సరే కొత్త నటీమణులకు పాడించాలన్నా, కష్టతరమైన పాటలున్నా సరే.. అలాంటి వారికి కేరాఫ్‌గా వాణీజయరాం నిలిచారు. మూడుసార్లు ఉత్తమగాయనిగా జాతీయ అవార్డులు పొందారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.
          అయితే వాణీ జయరాం మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణీ జయరాం ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళ ఫ్లాట్‌ తలుపుతట్టగా లోపలి నుంచి స్పందన లేదు. ఆమె ఐదుసార్లు కాలింగ్‌ బెల్‌ కొట్టినా తలుపు తీయలేదు. దాంతో పనిమనిషి భర్త తన ఫోన్‌లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్‌ చేశాడు. అయినా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫోన్‌ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్టుగా తీవ్ర గాయాలున్నాయి. వెంటనే పనిమనిషి, స్థానికులు కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్‌లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం
ఆటపాటతో చైతన్యం
ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు
జనరిక్‌ మందులను ప్రచారంలోకి తీసుకురావాలి
కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.