Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు

Mon 06 Feb 04:20:40.171773 2023

- నకిలీ భూ పట్టాలతో వచ్చే వారిని తరిమికొట్టాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-భూపాలపల్లి/గోవిందరావుపేట
           కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, సీపీఐ(ఎం) పోరాటాలకు నిలయమని, ఎన్ని కేసులైనా భయపడేది లేదని, జైలుకెళ్లడంతోపాటు ప్రాణాలైనా అర్పిస్తామని, పేదలకు పట్టాలు ఇచ్చి, ఇల్లు నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాల్సిందేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య స్పష్టంచేశారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు శిఖం భూమిలో సర్వేనెంబర్‌-280, 283, 284, 285లోని సుమారు 24 ఎకరాల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పది రోజులుగా సుమారు 3500 గుడిసెలు వెలిశాయి. వీరికి మద్దతు తెలిపేందుకు ఆదివారం వచ్చిన నాగయ్యకు స్వాగతం పలికేందుకు గుడిసెవాసులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీఆర్‌ నగర్‌ నుంచి గుడిసెల ప్రాంతం వరకు కోలాటాలు డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, డీజే పాటలతో భూపాలపల్లి ప్రాంతమంతా ఎర్రమయమయింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాగయ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబానికి భూమి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పేదల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి నేడు విస్మరించాయన్నారు. నిరుపేదలకు సొంత ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించినా ప్రజలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూ పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. భూపాలపల్లి పట్టణంలో గూడు కోసం గుడిసెలు వేసుకుంటే అధికారులు శిఖం భూమికి పట్టాలు రావని చెప్పడం దారుణమన్నారు. బడా భూస్వాములకు శిఖం భూములను ఎలా కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే చెరువు శికం భూమిలో మార్కెట్‌ యార్డు, ఆటో నగర్‌ నిర్మాణం కోసం రూ.9లక్షలు కేటాయించి శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. ఇక్కడ సుమారు 10,000 వేల మంది ప్రజలు ఇండ్లు లేని వారు ఉన్నారని, అందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో నిర్వహించిన గుడిసెవాసుల సమావేశంలోనూ నాగయ్య పాల్గొని మాట్లాడారు. విలువైన భూముల కోసం నకిలీ పట్టాలు సృష్టించుకొని వచ్చేవారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పస్రాలోని 109 సర్వే నెంబర్‌లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు 40లక్షల మంది ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షల మందికి మాత్రమే ఇండ్లు ఇచ్చిందని, ఇలా ఇస్తే మిగతా వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వాల మీద నమ్మకం లేకనే పేద ప్రజలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని గుడిసెలు నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఈనెల 9న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ ఎదుట ధర్నాచౌక్‌లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో.. వ్యకాసా రాష్ట్ర నాయకులు బీరెడ్డి సాంబ శివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దమెర కిరణ్‌, జిల్లా కమిటీ సభ్యులు డబ్బా రాజన్న, వంగల రామస్వామి, గుర్రం దేవేందర్‌, అత్కురి శ్రీకాంత్‌, సంఘం నాయకులు ప్రీతి, గుడిసె వాసుల కమిటీ నాయకులు, ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం
ఆటపాటతో చైతన్యం
ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు
జనరిక్‌ మందులను ప్రచారంలోకి తీసుకురావాలి
కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.