- బోయినపల్లి వినోద్ కుమార్ నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర శాసనసభ రద్దయి, రాష్ట్రపతి పాలన వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అవన్ని ఊహాజనితాలని కొట్టి పారేశారు. అసలు శాసనసభ ఎందుకు రద్దవుతుందంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఊహాజనిత వ్యాఖ్యలకు తావుండబోదని స్పష్టం చేశారు.