- బండారు దత్తాత్రేయ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ సినీ నేపథ్యగాయకురాలు వాణి జయరాం మతి సంగీత, సాహిత్య రంగాలకు తీరని లోటని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపాన్ని ప్రకటించారు. వివిధ భాషల్లో 20వేల పాటలకు పైగా పాడిన ఆమె మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మధురమైన కంఠస్వరంతో ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారని పేర్కొన్నారు.