రైతుల ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి :పాకాల
Mon 06 Feb 04:44:29.998205 2023
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలమేరకు రైతుల ప్రయివేటు అప్పులు తీర్చేందుకు బ్యాంకులు రుణాలివ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే బ్యాంకులు ఆదిశగా ఆలోచన చేయడం లేదని పేర్కొన్నారు. రైతులు ప్రయివేటు అప్పులబారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించాలంటే, బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు.