Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి

Mon 06 Feb 05:23:44.925081 2023

- పదోన్నతులలో అన్ని ఖాళీలను భర్తీ చేయాలి
- బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి : టీఎస్‌యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
పదోన్నతులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఒకే రకంగా సమగ్రంగా రూపొందించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ (ఆఫీసు బేరర్స్‌) సమావేశం డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం ఆదివారం టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అన్ని ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని తద్వారా వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరారు. పండితులు, వ్యాయమ ఉపాధ్యాయులకు అందరితోపాటే పదోన్నతులు ఇవ్వాలనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జిఓ 317 ద్వారా పొరుగు జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులను పదోన్నతుల అనంతరం ఏర్పడిన ఖాళీల్లో సొంత జిల్లాలకు తీసుకురావాలనీ, మిగిలిన 13 జిల్లాల దంపతుల బదిలీలు పూర్తి చేయాలని సూచించారు.ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యంతరాలను స్వీకరించి సమగ్రమైన జాబితాలు రూపొందించాలన్నారు. పదోన్నతుల సందర్భంగా ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులతో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఇటీవల జరిగిన 615 స్పౌజ్‌ బదిలీలు పదోన్నతులకు నిర్దేశించిన పోస్టులలోనే చేసినందున తద్వారా ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల కోటాలోనే చేర్చాలని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర జిల్లాల్లో పైరవీ బదిలీల ద్వారా సబ్జెక్టేతర ఖాళీ (అగైనెస్ట్‌ వేకన్సీ) లో నియమించబడిన ఉపాధ్యాయుల పోస్టులను ఆయా సబ్జక్టుల పదోన్నతులకు ఖాళీలుగా చూపాలని రవి డిమాండ్‌ చేశారు. ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌, గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీ బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై సంఘాలతో సమావేశం నిర్వహించాలనీ, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు ఆరోగ్యకార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఎస్‌ యుటిఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌ రెడ్డి గెలుపు కోసం అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్‌ రాములు, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్‌, ఎం. రాజశేఖర్‌ రెడ్డి, జి నాగమణి, ఇ.గాలయ్య, బి.రాజు, ఎస్‌.రవిప్రసాద్‌, కె.రవికుమార్‌, జి శ్రీధర్‌, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి, ఎస్‌. కె.మహబూబ్‌ అలీ పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం
ఆటపాటతో చైతన్యం
ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు
జనరిక్‌ మందులను ప్రచారంలోకి తీసుకురావాలి
కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.