Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వ్యాపారంగా విద్య | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

వ్యాపారంగా విద్య

Mon 06 Feb 05:23:38.523527 2023

- ఉన్నత విద్యకు ఎన్‌ఈపీ ఆటంకం
- సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యం : మాజీ ఎంపీ, టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు
- ఘనంగా ప్రారంభమైన టీఏవీఎస్‌ రాష్ట్ర రెండో మహాసభలు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఆదిలాబాద్‌టౌన్‌
          కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడంతో విద్య వ్యాపారంగా మారిందని భద్రాచలం మాజీ ఎంపీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు అన్నారు. మార్కెట్‌ శక్తులు విద్యారంగాన్ని శాసిస్తున్నాయని తెలిపారు. పాతకాలం నాటి చెత్తను తీసుకొచ్చి చొప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట ఆదివారం తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం(టీఏవీఎస్‌) రెండో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచి ఆదివాసీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా జిల్లాల నుంచి విద్యార్థుల రాకతో స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవన పరిసర ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మిడియం బాబురావు మాట్లాడుతూ.. దేశమంతా కోవిడ్‌తో ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే సమయంలో నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ-2020)ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ విధానంలో మూడు రకాల భావనలు చొప్పించిందని చెప్పారు. ఏ స్థాయిలో చదువుకుంటే అదే స్థాయిలో నైపుణ్య సర్టిఫికేట్‌ ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారని పలు ఉదాహరణలిచ్చారు. ప్రాథమిక విద్యలో స్థానిక తెగల భాషలు లేకుండా పోతున్నాయని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విజ్ఞానవంతమైన చదువు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాలు అమ్మితే వచ్చేలాభాలు ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్నాయన్నారు. మత భావనలతో విద్యా విధానాన్ని నింపే పరిస్థితి వచ్చిందని వివరించారు. ఆదివాసీ బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ నూతన విధానం ఆటంకంగా మారుతుందని స్పష్టం చేశారు. హస్టల్‌లో కోడిగుడ్డును కూడా పెట్టకుండా మెనూను సైతం లాగేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేస్తోందని, ఫెలోషిప్‌లో కోత విధించడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏదైనా చట్టం ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుందని చెప్పారు. ఆదివాసీ విద్యార్థులకు టీఏవీఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందని, పోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, టీఏవీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మెస్రం రాజు, పూసం సచిన్‌, టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, సరియం కోటేశ్వర్‌రావు, లంక రాఘవులు, టీఏవీఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్రం ఈశ్వర్‌, బైరి సోమేష్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్‌, నాయకులు ఆత్రం తానూష్‌, మెస్రం నర్మద, కోట్నాక్‌ పుష్పలత, మాలశ్రీ, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి ఆదివాసీ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం
ఆటపాటతో చైతన్యం
ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు
జనరిక్‌ మందులను ప్రచారంలోకి తీసుకురావాలి
కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.