Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత్‌ చేతికి జీ20 పగ్గాలు.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

భారత్‌ చేతికి జీ20 పగ్గాలు..

Thu 17 Nov 01:34:44.286872 2022

- వచ్చే ఏడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ఇండియా
- అందరినీ కలుపుకుని పోయే కార్యాచరణ : మోడీ
బాలి : రాబోయే సంవత్సరానికి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఈ బాధ్యతలను ప్రధాని నరేంద్రమోడీకి అప్పగించారు. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న జీ-20 సదస్సు సంయుక్త డిక్లరేషన్‌ను ఖరారుచేసిన అనంతరం బుధవారం బాధ్యతల అప్పగింత జరిగింది. 'ప్రతి ఒక్క దేశం కృషితో అంతర్జాతీయ సంక్షేమానికి ఒక ఉత్ప్రేరకంగా జీ-20 సదస్సును రూపొందించాలి.'' అని మోడీ అన్నారు. జీ-20కి భారత్‌ అధ్యక్షత వహించే పదవీకాలంలో అందరినీ కలుపుకుని పోయేలా, బృహత్తరంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణతో కూడి వుంటుందని మోడీ ప్రకటించారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో, ఆర్థిక మాంద్యంతో, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ బాధ్యతలను చేపట్టామని మోడీ పేర్కొన్నారు. ఈ బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని, వివిధ నగరాలు, రాష్ట్రాల్లో జీ-20 సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశం యొక్క అద్భుతమైన వైవిధ్యం, సాంప్రదాయాలు, సాంస్కృతిక సుసంపన్నతలను అతిథులకు అనుభవంలోకి తెస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృక వంటి భారతదేశంలో విశిష్టంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. నూతన ఆలోచనలతో, సమిష్టి కార్యాచరణను మరింత వేగవంతం చేసేందుకు జీ-20 కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే జి-20 సదస్సుకు అనుసరించబోయే థీమ్‌లో 'అభివృద్ధి కోసం డేటా' అన్న సిద్ధాంతం అంతర్భాగంగా వుంటుందని మోడీ చెప్పారు. బాలి సదస్సు సందర్భంగా డిజిటల్‌ పరివర్తనపై వర్కింగ్‌ సెషన్‌లో ప్రధాని మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో, ఇతర ప్రపంచ నేతలు పాల్గొన్నారు. ''మన శకంలో డిజిటల్‌ పరివర్తన అనేది అత్యంత గణనీయమైన మార్పు. డిజిటల్‌ సాంకేతికతలను సక్రమంగా ఉపయోగించుకుంటే రాబోయే దశాబ్దాల కాలంలో పలు రెట్ల శక్తిగా మారగలదు.'' అని మోడీ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై పోరాడడంలో కూడా డిజిటల్‌ పరిష్కారమనేది ఉపయుక్తంగా వుంటుందన్నారు.
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని జి-20 సదస్సు ఖండించింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ నేతలు బుధవారం సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించారు. యుద్ధాన్ని మెజారిటీ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయని, ఇతరత్రా అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని ఆ డిక్లరేషన్‌ పేర్కొంది. భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించుకునేం దుకు జి-20 సరైన వేదిక కాదని డిక్లరేషన్‌ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించాలని కోరింది. అణ్వాయుధాల వినియోగం ముప్పును ఖండించింది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లకు తరలి వెళ్లాల్సిన గోధుమలు వంటి ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో నల్ల సముద్రం ద్వారా తరలించేందుకు చేపట్టిన చొరవను సమావేశం స్వాగతించింది.
జర్మనీతో సహకార విస్తరణపై మోడీ చర్చలు
జర్మనీ ఛాన్సలర్‌ ఓల్ప్‌ షుల్జుతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఆర్థిక కార్యకలాపాలను, రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు గల అవకాశాలను ఇరువురు నేతలు పరిశీలించారు. జర్మనీ ఛాన్సలర్‌ను కలుసుకోవడం ఆనందంగా వుందని మోడీ ట్వీట్‌ చేశారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. రక్షణ, భద్రత, వలసలు, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి పలురంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు, వాణిజ్య, పెట్టుబడులను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత
ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
నేపాల్‌లో కూలిన విమానం
పర్యావరణం పట్టదా..!
రొమేనియాకు నాటో నిఘా విమానం
సరిహద్దు అంశంపై చైనా, భూటాన్‌ చర్చలు
ఇద్దరు పాలస్తీనియన్ల హత్య
ఆపిల్‌ సీఈఓ జీతంలో భారీ కోత
అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు
ప్రజాస్వామ్యానికి బ్రెజిలియన్ల మద్దతు
బరితెగించారు
తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక !
'మోర్‌ డాక్టర్స్‌' పునరుద్ధరణ
40 ఏండ్ల నిర్బంధం తర్వాత పాలస్తీనా ఖైదీ విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.