- ప్రకటించిన పది చైనా నగరాలు బీజింగ్ : ప్రభుత్వ రవాణా వాహనాల్లో ఎక్కేందుకు 48గంటలు ముందుగా చేయించుకున్న కోవిడ్ పరీక్షా ఫలితాన్ని అందచేయాలన్న నిబంధనకు ఇక స్వస్తి చెబుతున్నట్లు చైనాలోని పది ప్రధాన నగరాలు ప్రకటించాయి. ఇలా ప్రకటించిన నగరాల్లో చెంగ్డు, తియాన్‌జిన్, దాలియన్, షిజియాజుంగ్, షెంజాన్ వంటివి వున్నాయి. ఫార్మసీలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు వంటి బహిరంగ వేదిల్లోకి ప్రవేశించడానికి కూడా ఇకపై కోవిడ్ పరీక్షలు చేయించుకోనవసరం లేదని మరికొన్ని నగరాలు ప్రకటించాయి. దక్షిణ చైనా గుయాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెంజాన్ నగరం సాంకేతిక, తయారీ రంగ కేంద్రంగా వుంది. ప్రభుత్వ రవాణా వాహనాల్లోకి ఎక్కాలన్నా, బహిరంగ వేదికల్లోకి ప్రవేశించాలన్న ఇకపై ఈ నగరవాసులు న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష సర్టిఫికెట్‌ను అందచేయాల్సిన అవసరం లేదని శనివారం ఉదయం ప్రకటన జారీ చేసింది. అయితే వేదిక కోడ్‌ను స్కాన్ చేయాల్సిన అవసరం వుందని, గ్రీన్ హెల్త్ కోడ్‌ను చూపించాలి వుంటుందని తెలిపింది. రైతు మార్కెట్లకు వెళ్ళేపుడు మాత్రం న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష తప్పనిసరిగా వుంది. మెగాసిటీ గుయాంగ్జు కూడా చాలా వరకు ఆంక్షలను ఎత్తివేసింది. మరికొన్ని నగరాలు చాలావరకు సద్దుబాట్లను ప్రకటించాయి.