లాస్‌ఏంజెల్స్ : అమెరికాలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మరణించగా, 16 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కాల్పులు జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. అయితే ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయలేదని పేర్కొంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ వేలాదిమంది ఉన్నట్టు వెల్లడించింది. చైనీయుల లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ వేడుకల అనంతరం ఈ ఘటన జరిగింది. మాంటేరీ పార్క్ లాస్ ఏంజెల్స్‌కు కౌంటీ. ఇది ప్రధాన నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.