Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జయహో నాటు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

జయహో నాటు

Tue 14 Mar 03:28:18.326175 2023

- తెలుగు పాటకు దక్కిన అరుదైన గౌరవం
- ఆస్కార్‌ వేదికను ఊపేసిస నాటు నాటు పాట
భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. 'నాటు నాటు' పాటకి ఆస్కార్‌ తధ్యమంటూ ప్రపంచ సినీ విశ్లేషకులు చెప్పిన జోస్యం నిజమైంది.
ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌కు నామినేషన్‌ దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పిన ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పుడు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటుగానూ ఆస్కార్‌ అందుకుని చరిత్ర సష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంపై నిలబెట్టింది.
ప్రతీ తెలుగువాడిని గర్వపడేలా చేసింది. భారతీయ సినిమాకు ఎన్నో ఏండ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్‌ అవార్డును 'నాటు..నాటు' పాట సాకారం చేసింది.
- చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ 
- భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయం

- ఆ కలని సాకారం చేసిన ఘనత రాజమౌళిదే..
- బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌గా 'ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'
- ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌కి ఉత్తమ చిత్రంతో సహా 6 ఆస్కార్‌లు..
లాస్‌ ఏంజిల్స్‌ : యావత్‌ భారతీయులందరినీ గర్వపడేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిదిన్నర దశాబ్దాల ఆస్కార్‌ చరిత్రలో ఆస్కార్‌ని సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా పాటగానే కాకుండా తొలి తెలుగు సినిమా పాటకి దక్కిన అరుదైన గౌరవం ఇది. ఈ కల కేవలం దర్శకుడు రాజమౌళి వల్లే సాధ్యమైంది. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల్లో మన దేశం మూడు నామినేషన్లతో రంగంలోకి దిగింది. అయితే మన దేశం నుంచి బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేట్‌ అయిన 'ఆల్‌ దట్‌ బ్రీత్స్‌'కి అవార్డు దక్కలేదు.
అట్టహాసంగా...
లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ ప్రదానోత్సవం ఆరంభమైంది. ఈ వేడుక ఆరంభంలోనే వ్యాఖ్యాత జిమ్మీ కెమ్మిల్‌ స్టేజ్‌పైకి వస్తున్నప్పుడు కొంతమంది డాన్సర్లు 'నాటు నాటు' పాటకు స్టెప్పులేస్తూ రావడం ఓ విశేషమైతే, ఇదే స్టేజ్‌ మీద ఇదే పాటను తెలుగు గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడగా లైవ్‌లో హాలీవుడ్‌ నటీనటులు డాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌ చేయటం మరో విశేషం. ఈ పాట సందర్భాన్ని చెప్పేందుకు బాలీవుడ్‌ అగ్రకథానాయిక దీపికా పదుకొనె ఆస్కార్‌ వేదికపై మెరిసినప్పుడు డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది.
'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'
అలాగే ప్రకృతికి, మనుషులకు, జంతువుల మధ్య ఉండే బంధాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించిన 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' డాక్యుమెంటరీ సైతం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాన్ని దక్కించుకుని మన దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంచింది.
ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో ఇప్పటివరకు భారతీయులు కూడా అవార్డులు అందుకున్నారు. కానీ వారంతా విదేశీ చిత్రాలకు పని చేశారు. అయితే ఈసారి ఆస్కార్‌ని అందుకుంది మన చిత్రాలకు పని చేసిన మన వాళ్లే కావడం విశేషం.
'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌'
ఇదిలా ఉంటే, ఓ వలస కుటుంబం చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' చిత్రం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌కి ఎంపికైంది. అంతేకాదు ఈ
సినిమా ఏకంగా మరో 6 ఆస్కార్‌లను కైవసం చేసుకుని 95వ ఆస్కార్‌ అవార్డుల్లో ప్రధమ స్థానంలో నిలిచింది. మొత్తం 11 నామినేషన్లతో బరిలోకి దిగిన 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను గెలిచి రికార్డు క్రియేట్‌ చేసింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌, ఉత్తమ విదేశీ చిత్రం విభాగాల్లో 'ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌' చిత్రం సొంతం చేసుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక 'ది వేల్‌' చిత్రం కూడా బెస్ట్‌ మేకప్‌, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఆస్కార్లను దక్కించుకుంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌), ఉత్తమ నటిగా మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), ఉత్తమ దర్శకులుగా డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) ఆస్కార్‌లను సొంతం చేసుకున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు
వెనిజులా విప్లవ నేత చావెజ్‌కు పలువురు నేతల నివాళులు
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ కన్నుమూత..
భారత్‌ నిశ్సబ్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది
7.2 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌
ఘోర ప్రమాదం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.