ఆ అనంత వినీలాకాశంలో అన్నీ తళుకు తారలే! విహంగ వీక్షణం చేసి మురిసి ఆనందించే మనసులు కావాలి కానీ!
ఆ అపార జలరాశిలో అన్నీ పగడపు దీవులే! సాగర గర్భాన్ని శోధించి సాధించే గజ ఈతగాళ్లు కావాలి కానీ!
ఆ సారవంత క్షేత్ర పొరలనిండా అన్నీ గట్టివిత్తనాలే! సాగుచేసి కలుపుతీసి ఫలసాయం పొందే కషీవలురుకావాలి కానీ!
ఆ పరిమళ పుష్పవనం నిండా అన్నీ
సుగంధ భరిత సుమాలే! ఆఘ్రాణించి అనుభూతి పొంది పరవశించే రసికులు కావాలి కానీ!
ఆ తియ్య మామిడి తోటనిండా అన్నీ మధుర ఫలభరిత వక్షాలే! చూషించి లేహ్యించి భుజించి భక్షించి జీర్ణించుకునే జీవనోపాసకులు కావాలి కానీ!
ఆ నిశ్శబ్ద రణరంగస్థల దొంతరలనిండా అన్నీ అస్త్రశస్త్రాభ్యసన ్ఞనసాధనాలే! తాపసులై తర్ఫీదుపొంది! ఘనవిజయాలను సొంతం చేసుకుని తరించి విలువల జీవనం గడపాలిమరి!! - కరిపె రాజ్ కుమార్, 8125144729