నవతెలంగాణ - ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 41 పాయింట్ల నష్టంతో 61,891 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 18,277 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పతనమై 82.30 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. డెట్ సీలింగ్ పరిమితి పెంపుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. దీనిపై సయోధ్య కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జూన్ 1 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికా డెట్ డిఫాల్ట్‌గా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. విదేశీ మదుపర్లు రూ.1,406.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు రూ.886.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 May,2023 10:15AM