నవతెలంగాణ - హైదరాబాద్: చదరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆరేండ్ల వయసులో పావులు కదపడం నేర్చిన ఈ హైదరాబాదీ.. పదిహేనేండ్ల వయసులోనే భారత 82వ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు సాధించిన ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు. తెలంగాణ సచివాలయంలో కేసీఆర్‌ను ప్రణీత్‌తో పాటు అతని తల్లిదండ్రులు కలిశారు. చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ కావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణీత్ తల్లిదండ్రులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్. ప్రణీత్‌కు శిక్షణ, ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm