నవతెలంగాణ - నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 10 లక్షల విలువ చేస్తుందని పోలీసులు నిర్ధారించారు. అరెస్టు అయిన వారిలో ఒడిశాకు చెందిన అశోక్ తారఫర్, అభిజిత్ తారఫర్, ఫణి తారఫర్, శిఖా బిస్వాల్, ధనుంజయ్ బిస్వాల్, మధ్యప్రదేశ్‌కు చెందిన జీవన్ సింగ్ యాదవ్ ఉన్నారు. వినయ్, వివేక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా నల్లగొండ ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ.. టాస్క్ ఫోర్స్, కేతెపల్లి పోలీసులు సంయుక్తంగా కలిసి కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఓ బస్సును తనిఖీ చేస్తుండగా ఎనిమిది మంది వ్యక్తులు బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, వారిలో ఆరుగురిని పట్టుకున్నారు. ఆరుగురు నిందితుల నుంచి 103 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2023 05:35PM