నవతెలంగాణ - యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శనాలు టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్ పోర్టల్‌ను ఆధునీకరించారు. దీంతోపాటు దేవస్థాన ఆన్లైన్ సేవలను పూర్తిగా ఈసీఐఎల్ కంపెనీకి అప్పగించగా పనులు సాగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా దేవస్థాన వెబ్ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆధునీకీకరణ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఆన్లైన్ సేవలను మంగళవారం తిరిగి పునఃప్రారంభించారు.
భక్తులు ఆన్లైన్లో yadadritemple.telangana.gov.in సేవలను సద్వినియోగించుకోవాలని ఆలయ ఈవో ఎన్.గీత సూచించారు. స్వామివారి ఆర్జిత సేవలైన నిజాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నారసింహా హోమం, స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం, శయనోత్సవం, జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన, సుప్రభాత దర్శనం కోసం ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2023 08:20PM