నవతెలంగాణ - హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలీసెట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరికోసం 296 పరీక్షా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట హెచ్బీ బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకోని రావాలని సూచించారు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కాని వారు ఒక పాస్పోర్టు సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm