నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికోలోని తమౌలిపాస్ రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ట్రాక్టర్ ట్రాలీ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో 26 మంది మృతిచెందారు. ప్రమాదంలో ట్రాలీలో మంటలు చెలరేగాయి. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు ట్రాలీని తీసుకెళ్తున్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్ పరారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను ప్రయివేటు సంస్థకు చెందిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని చెప్పారు. వారంతా మెక్సికోకు చెందినవారేనని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm