నవతెలంగాణ - హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూరీడు చుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం సమయానికి ఉష్ణోగ్రతలు భగభగలాడిపోతున్నాయి. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని చెబుతుంటారు. కానీ ఈసారి రోహిణి కార్తె రాకముందే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీలోని రాజమండ్రి, గుంటూరు, ఏలూరులో ఇవాళ 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలోనూ విపరీతమైన వేడిమి నెలకొంది. బెజవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చిలకలూరిపేటలో కూడా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2023 04:16PM