Sat 29 Apr 23:07:22.944436 2023
Authorization
వారి నిజమైన సమస్య అస్థిత్వం. వీరికి సమస్య ఇంట్లోనే మొదలవుతుంది. ఇంట్లోవారికి తమ లైంగికతను చెప్పలేరు, చెప్పినా అర్థం చేసుకుంటారో లేదో అని భయం. అన్నింటిలో మంచి అనిపించుకున్న తాము ఈ ఒక్క లోపం కారణంగా అందరికీ చెడు అవుతున్నామనేది వీరి బాధ. వీరిపై సమాజంలో ఇప్పటికే ఎంతో వ్యతిరేకత వుంది. కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి ఎటువంటి కష్టం, నష్టం కలగకుండా, అసలు వారేంటో ఎవరికీ తెలీకుండా సహజీవనం చేస్తున్నా వేధింపులు తప్పడంలేదు వీరికి.
భారతీయ పెళ్ళిళ్ళకు చాలా ప్రాధాన్యత వుంది. ప్రాధాన్యత ఎంత వుందో, కొన్ని పెళ్ళిళ్ళకు సమస్యలూ అలానే వుంటున్నాయి. మొదట ఒకే కులంలోనైనా శాఖల దగ్గర మొదలైన ఈ సమస్య కులాంతర, మతాంతర వివాహాలు, దేశాంతర, ఖండాంతర వివాహాల నుండి ఇప్పుడు స్వలింగ వివాహాల వరకూ వచ్చింది.
మన దేశంలో కొన్ని లక్షలమంది స్వలింగ సంపర్కులున్నారని సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందువల్లే చాలా మందికి ఈ స్వలింగ సంపర్కుల వివాహం గురించి తెలిసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 15 జంటలు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాయి. ధైర్యంగా కోర్టు వరకూ వెళ్ళిన వీరి సంఖ్యే ఇంత వుంటే, ఇక మన చుట్టూ ఇంకెంతమంది వున్నారో! వీరి సంఖ్య ఎన్ని లక్షల్లో వుందో అర్థం చేసుకోవచ్చు.
వీళ్ళు తొలి చూపులోనే ప్రేమలో పడిపోయి, పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. మొదట ఆఫీస్ కొలీగ్స్గానో, కాలేజీ ఫ్రెండ్స్గానో వున్న వీరి మధ్య మాటలు, స్నేహం పెరిగి తర్వాతే ప్రేమలో పడుతున్నారు. ఏవో కొన్ని అల్ట్రా మోడ్రన్ కుటుంబాల్లో ఇలాంటి ప్రేమలు పెళ్ళిళ్ళ వరకూ వెళ్ళున్నాయి కానీ, చాలా వరకు ఇలాంటి సంబంధాలు చాటుమాటు వ్యవహారాల్లాగే వుండిపోతున్నాయి. అందుక్కారణం కూడా లేకపోలేదు.
స్వలింగ వివాహాల గురించి సమాజంలో ఎన్నో ప్రశ్నలున్నాయి. సమాజం నుండి ఎన్నో ఎత్తిపొడుపులు, సూటిపోటి మాటలు ఎదురవుతాయి. ఒకవేళ వారు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటే, వాళ్ళు ఇంకెన్ని ఇబ్బందులు పడాలి? ఇన్ని సమస్యలు భావి జీవితంలో ఎదురవుతాయని తెలిసినా వీరు తమ అభిప్రాయాన్ని మార్చుకోకుండా కోర్టుకెక్కారు.
వారి నిజమైన సమస్య అస్థిత్వం. వీరికి సమస్య ఇంట్లోనే మొదలవుతుంది. ఇంట్లోవారికి తమ లైంగికతను చెప్పలేరు, చెప్పినా అర్థం చేసుకుంటారో లేదో అని భయం. అన్నింటిలో మంచి అనిపించుకున్న తాము ఈ ఒక్క లోపం కారణంగా అందరికీ చెడు అవుతున్నామనేది వీరి బాధ. వీరిపై సమాజంలో ఇప్పటికే ఎంతో వ్యతిరేకత వుంది. కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి ఎటువంటి కష్టం, నష్టం కలగకుండా, అసలు వారేంటో ఎవరికీ తెలీకుండా సహజీవనం చేస్తున్నా వేధింపులు తప్పడంలేదు.
వీరితో మాట్లాడ్డమే ఓ నేరం అన్నట్లు చూస్తుంది సమాజం. ఇండ్లు అద్దెకు దొరకవు, ఎంత రేటు పెట్టి కొనాలన్నా ఎవ్వరూ అమ్మరు. ఇక అల్లరి మూకలతో, మతఛాందసులతో వీరికి అనునిత్యం భయమే! తమను తాము కాపాడుకోవాలంటే, సమాజంలో తమకంటూ ఓ స్థానం, భద్రత కావాలనే కోర్టు మెట్లెక్కారు. వీళ్ళలో ఎక్కువమంది హై సొసైటీకి చెందిన వారేనని ఓ సంస్థ సర్వే. వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా సమాజంలో చిన్నచూపు, చీత్కారం తప్పడం లేదు.
స్వలింగ సంపర్కమేమీ అంటురోగమో, అనాకారి తనమో కాదు, వీళ్ళు కూడా అందరిలాగే అన్ని పనులు, అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు ప్రత్యేకమైన మనుషులేమీ కాదు అంటున్నారు మానసిక వైద్యులు. అంతే కాదు, వీరి మధ్య సత్సంబంధాలు కూడా చాలా ఎక్కువంటున్నారు.
సమాజంలో మార్పు సహజం. కొత్త నీరు వస్తుందంటే పాత నీరు కొట్టుకుపోతుంది. మనది కాని విదేశీ సంస్కృతులనెన్నింటినో అతి సహజంగా అందిపుచ్చుకుంది మన దేశం. ఇప్పుడు కొత్తగా సమస్యను లేవనెత్తిన ఈ స్వలింగ సంపర్క వివాహాలను మతవాదులు, సంప్రదాయవాదులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
2018లో సుప్రీంకోర్టు గే, లెబ్సియన్ల సెక్స్ తప్పుకాదని తీర్పునిచ్చింది. గత వారం సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పింది. అయితే పెళ్ళికి, చట్టబద్దతకు మాత్రం పార్లమెంటు ఆమోదం కావాలంది. మన దేశం రాజ్యాంగం రాసుకున్నప్పటి నుండి అవసరానికి అనుగుణంగా అందులో ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తూనే వుంది. పార్లమెంటులో కొత్త బిల్లులు ప్రవేశపెడుతున్నారు. మరి వీరి సమస్యను ఏం చేస్తుందో!? వీరి సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.