అమ్మా! భారతమాతా! నువ్వు దాస్య శంఖలాలు తెంచుకొని రెక్కలు విప్పుకున్నాక నేను కళ్ళు తెరిచాను. ఈ సంగతి నీకు తెలుసు లోకానికి తెలుసు నాకూ తెలుసు కానీ ఇన్నాళ్ళకు, నేనిప్పుడు డియన్ఏ టెస్ట్ చేయిచుకోవాలట ! అదిగో ! అప్పుడే కొన్ని చెవులు కొరుక్కుంటున్నాయి మరి కొన్ని చేతులు బిగుస్తున్నాయి ! నిన్ను తాకట్టు పెట్టినా అమ్మకానికి విశ్వ విఫణిలో నిలబెట్టినా నేను నోటికి తాళం వేసుకొని ఉండాలట! ప్రశ్నిస్తే, అర్థరాత్రి తనిఖీలు అరెస్టు వారెంటులు ''అయ్యా యస్స్'' అంటే అవార్డులు రివార్డులు ఐనా, నీ స్వతంత్య్ర పోరాట స్ఫూర్తితో భగత్ సింగ్ ఆజాద్ ల నినాదాలతో మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాను వందే మాతరం వందే మాతరం