అర చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు దోస్తులతో దినమంతా సొల్లు కబుర్లకిక కొదువే లేదు
కళ్లముందున్న వాళ్ళను ఎంతకి గుర్తు పట్టలేక పేర్లను మరిచిపోతున్నారుజి నిలబడిన చోట నిలబడకుండ
అమాంతం తూలి కింద పడిపోతున్నారుజి వంచిన తల పైకెత్తకుండా నేల వైపు చూస్తూ నిలువునా వంగి పోతున్నారు ఎన్ని సార్లు పిలిచిన ఉలుకు లేదు పలుకు లేదు పని పేరు చెబితే చాలు గంటసేపైన పైకి లేచి నిలబడటం లేదు
ఒంటి మీద గిల్లితే చీమైన చిటుక్కున కుట్టినట్టు కనిపించడం లేదు చెవిలో శంఖం ఊదితే శెనగలు పదహారంటున్నారు
అన్నం తినమని గదా పట్టుకొని బతిమిలాడితే ఆకలి లేదు పొమ్మంటున్నారు స్నానానికి వెల్లకుండా సెంట్లను పూసుకొని చెప్పిన
పని అయ్యిందని పిస్తున్నారు సమయానికి నిదుర పోకుండా ఎరుపెక్కిన కళ్ళతో విధిలేక ఎదురు పడిన వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెబుతున్నారు
అయ్య బాబోరు! ఇంతకాలం ఈ దిక్కుమాలిన సెల్ ఫోనులు లేందే నయమైంది లేకపోతే నడమంత్రం ఫ్యాషన్ ఏదో మనల్ని కనబడకుండా తలకిందులు చేసి అరచేతిలో వైకుంఠం చూపేది!!