ఎప్పటిలాగే రైలు కిటికీ పక్కనే చూపుల రెపరెపలు. దశ్యాల తుప్పర్లకు కళ్ళు వర్షంలో తడిసిన కుందేళ్లులా అందాలన్ని తిరుగుతుంటే, పుస్తకంలోని పేజీల్లా పరిసరాలను చదేవేస్తున్న ఆలోచనలు రైలు వేగంతో సమానంగా దూసుకెళ్తుంటే ఓ స్టేషన్లో ఆగిన రైలు నుండి మనసు ఎగిరి కిందకు దూకి మనిషిని ముందుకు నెట్టి మనసు వెనక్కిలాగాయి. చేతి గడియారంలో కాలానికి గుండె గడియారంలో శబ్దానికి పుట్టిన బంధం బలంగా పాతుకుపోయి రేపటి రైలు కూత కోసం మెలుకువతో తప్పిపోయిన మనసును వేరుచేసిన స్టేషన్లో గుర్తుపట్టాలని క్షణాల్ని వెనక్కు తన్ని గుర్రపు పరుగుతో దుమ్ము రేపుతూ తల నుండి తోకదాకా నిమిష నిమిషానికి హదయస్పందల్ని పెంచుకుంటూ తన గుర్తుల్ని పోల్చుకుంటూ చేతులు చాచి అందిస్తుంది ఊహల ఊతాన్ని దూకిన చోట విసిరింది - శీ సాహితి, 9704437247