Sat 29 May 21:56:46.760055 2021 ఎప్పటిలానేఋతు ధర్మపు క్రమశిక్షణ తప్పనిభూమధ్య రేఖ..నడినెత్తిన సూరీడు మంటలు !స్వంత ఊరుపరుగులో పిడచకట్టిన నాలుకఆకలి సెకలకు కాలుతున్న పేగులు..రహదారులపై..రక్తమోడుతున్న పాదపు గుర్తులు !ఆర్థిక వెన్నెముక లేనికూలీ బతుక్కిజాతీయ గుర్తింపు చిహ్నాలు.వీపుపై మూటా ముల్లెలు !కుటుంబ..ప్రేమకు తీపి గుర్తులుగాపసిపిల్లల అడుగుల్ని మోస్తున్నకన్నతండ్రి భుజాలు..కన్నీటి కావటి కుండలు !గమ్యం తెలిసినాగమనం ఎట్లనో తెలియనిసంధి కాలపు క్లిష్టసందర్భాలు !కాళ్ళే రెండు చక్రాలుగఎండనక, వాననకచెమట గంధపు శరీరాలువేసే ప్రతి అడుగులు..దూరదుఃఖపు మడుగులు !పాదాలే పనిముట్లుగతొవ్వలపైజిస్వేదనదులుగ ప్రవహిస్తూనడక పుట్లనుపండిస్తున్న ఎర్ర గోరంటలు !తూర్పు..శ్రమకొండల నడుమ పొడిసిసొంత గూటికి తరలుతున్నపడమటి పని పొద్దులు !(వలస కార్మికులు సొంతూళ్ళకు చేరే తపనలో పడే ఇబ్బందుల నేపథ్యంలో..)- అశోక్ అవారి, 9000576581 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి