Sun 20 Jun 07:25:11.631697 2021 అబ్బే లేదండీనాన్నంత గొప్పోడేంగాదుసరిగ్గా లెక్కలే రావుఅప్పులెప్పుడూ తక్కువజేసి చెప్పేవాడు!బడిదారిలో ఎందరోనాన్న గురించి అడుగుతుంటేఅబ్బ ఊరంతా స్నేహితులే అనిపించేదిఅబ్బే లేదండీ.. ఇంటికొచ్చిలెక్కలేవో నేర్పించి వెళ్ళేవాళ్ళు!చీకట్లో చుక్కలు లెక్కబెడుతుంటేఅక్కున జేర్చుకొని జోకొడుతూఎక్కాలు పద్యాలడిగేది నేర్చుకొందామనోమనస్సుకేం కూడికలు జరిగేవో!పీడకల్లొచ్చి అర్దరాత్రుల్లు ఎప్పుడు మేల్కొన్నాఅప్పుడూ అప్పులు ఆస్తులు లెక్కలేఅమ్మ రెండూ సరితూగాయనినాన్నకి తీవ్రంగా లెక్కలు నేర్పుతుండేది!కన్నవారిని కనిపెట్టుకొనుంటూకలల మూటలెన్ని అటకమీదెట్టాడోకోర్కెల మొగ్గలెన్ని తుంచేసుకున్నాడోఆ లెక్కలేవీ సరిగ్గా తెలీవు నాన్నకి!అత్యవసరాలెన్ని నెత్తినబడ్డాతాతలనాటి ఆస్తులమ్మేదిగాదు..కన్నపిల్లల చదువో పెళ్ళయితేలెక్కబెట్టకుండా తెగనమ్ముతుండేవాడు!తలరాతల లెక్కలు తప్పినాగుండె సడుల లెక్కలు తప్పకుండాఅధిక రక్తపోటు చలానా బారినపడకుండాయోగా అకౌంటెంటును బట్టి తప్పించుకుంటుండేది!లెక్కలు నేర్పించేవారి లిస్ట్ చాంతాడంతఏడాదికోసారి తిరిగి అప్పజెప్పేవాడునాన్న తప్పులు చెప్పేవాడేమోనెలల్లోనే అంతా మళ్ళీ నేర్పిస్తుండేవారు!- రవి కిషోర్ పెంట్రాల0044-07703327908లాంగ్లీ, లండన్ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి