Sun 08 Aug 00:21:09.221094 2021 వయసు చూస్తేనేమో సగంలో సగంమనిషి చూస్తే చిర పరిచయ రూపంబూటింగ్ లో నామ రూపాల మనోఫలకంపాత జ్ఞాపకాల బ్యాకప్ పొరల నుంచిఎంత సెర్చ్ చేసినా కొలిక్కి చిక్కని ఆకారంనల్లని చలాకీతనం చమత్కారాల సంభాషణఆ నవ్వుల నుంచి పన్ను మీద పన్ను మెరుపుతెల్లని పలు వరుస, ఎన్ని సార్లో మాట్లాడినట్లు..గలగల మాటల ఆగని వాగు ప్రవాహంఎక్కడో విన్నట్లే తోస్తున్నదిఆమె పద బంధాల మధ్య ఇంగ్లీష్ సౌందర్యంచెంప మీద సొట్ట, నొసలు మీద చెమటచూసినట్లే వర్చస్సు స్ఫురణకు రాని యశస్సుమనసు వయసు పెరుగుతున్న కొద్దీజ్ఞాపక పలకలు పలచగా అవుతాయేమోపదబంధ ప్రహేలికలో కూర్చే అక్షరాల్లానిలువూ అడ్డం గడులతో ఆలోచిస్తున్నానునలభైఏళ్ల కింది కాలమానిని కనిపించిందిపదో తరగతి నాటి క్లాస్మేట్ సాక్షాత్కారంఅవునవును ఆమె తనయనే ఈ అమ్మాయిఅచ్చం అమ్మ నోట్లో నుంచి ఊడి పడింది.- అన్నవరం దేవేందర్9440763479 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి