వాళ్ళు అంతేలే! అవకాశం కోసం పొంచి ఉంటారు అదను చూసుకుని దాడి చేస్తారు నీ పైనే కులం అనే ముసుగు కప్పేస్తారు నీకు రక్షణగా మతం అనే గోడలు కట్టేస్తారు.
నిన్ను అటబొమ్మను చేస్తారు మీడియాలో నిన్ను హీరోని చేస్తారు. తమ అవసరం తీరిందా ? ఇక నీవైపు కన్నెత్తి చూడలేరు. నీపై కులం బురద చల్లేస్తారు మతం రాళ్ళు విసిరేసారు. తిరిగి మీడియాలో నిన్ను జీరోను చేస్తారు.
అందరూ నీవారే నీకు ఆత్మీయులే నిరంతరం నీతో కలిసి జీవించే వారే!
ఇప్పుడు నువ్వు ఎవ్వరో తెలియదు నీది ఏకులమో అవసరం లేదు నువ్వే మతస్తుడవో అవసరంలేదు. వారి దష్టిలో నువ్వో నిర్జీవం.
వెతుకుతున్నారు మరో వ్యక్తి కోసం అతని కులం కోసం ,మతం కోసం. తమవాడో కాదో అని తెలుసుకునే ప్రయత్నంలో!