Sat 16 Oct 23:38:08.356903 2021 ప్యాలెసుల్లాంటి కొంపలుసూక్ష్మ సైజుల్లో కుటుంబాలు పెరుగుతున్న విద్యార్హతలుతరుగుతున్న లోక లౌక్యాలు ! ఆత్యాధునిక ఔషధాలు అరిగి పోతున్న ఆరోగ్యాలు చందమామపైనా అడుగులు ఇరుగుపొరుగులే అపరిచితులు !ఆదాయాలు కొండంతమనశ్శాంతి రవ్వంత ఐక్యూలు ఆకాశమంతభావోద్వేగాలు ఇసుమంత ! విజ్ఞానం సంద్రమంత వివేకం పాతాళమంత ఖరీదైన గడియాలున్నా.. సమయమే సన్నపూసైంది !సంబంధాలు అసంఖ్యాకంహదయ బంధాలు మగ్యం ముఖపుస్తక స్నేహాలు బోలెడుప్రాణమిత్రులు పిరికెడు కూడా లేరు ! బిలియన్ల మానవాళితో ధరణి అడుగంటేను కదా మానవీయతలు జంతువులు పథ్వి ప్రేమికులైననూ.. నరులైనారు పర్యావరణ హంతకులు !అమ్మానాన్నలు వద్ధాశ్రమాల్లో..కన్ను మూస్తే ఘనమైన కర్మకాండలు అంతర్జాలం అత్యవసరమైందిఅంతరాత్మే సదా గాఢ నిద్రలో ఉంది ! యూట్యూబ్‌లు ఊపిరయ్యాయి స్వార్థాలు, స్వాహాలు స్వారీ చేస్తున్నాయి పిల్లలకు కంటిపాప అమ్మే అయినా.. అమ్మే తమ సంతానానికి భారమైంది !చెత్తలో తిండి వేసే ప్రబుద్దులొకవైపు..ఆకలి చావుల కేకలు మరో వైపు ప్రాణాపాయ ప్రమాదం పొంచి ఉన్నా..సెల్ఫీ తీసే ఆత్రంలో నడవంత్రపు నరులు ! - మధుపాళీ కరీంనగర్, 9949700037 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి