Sat 23 Oct 23:19:38.201633 2021 కుప్పగా పోసి తగలబెడితేనిముషం కూడ పట్టకుండతగలబడి బూడిదయ్యే కాగితపు నోట్ల కట్టలను చూసి తెగ మురిసి పోతుంటావు! పైస పైస కూడ బెట్టుకొని పైకొచ్చిన నేను ఇతరులకు పరోపకారం చేయడమే ధర్మమని నాకు మాత్రమే తెలుసు! అరవొచ్చిన అహంకారంతో ఇంకెంతో కాలం పదవిలో ఉండలేని నీవు కళ్ళు నెత్తి కెక్కి తెచ్చి పెట్టుకున్న అహంభావంతోవిర్రవీగుతుంటావు! నేనెప్పటికి ఇలాగే కొండల నిలబడి అనువు గాని చోట అధికమనకుండ అద్దమందు ఒదిగి ఉండటం నాకు తెలుసు! అవసరమున్న లేకున్నానీ కళ్ళ ముందు నలుగురుంటే చాలు పూనకం వచ్చిన వాడిలా ఊగి పోతుంటావు! నేను మాత్రం వెయ్యేళ్ళ బోధి వక్షము కింద తపయోగం చేసిన మునిలా అన్నిటిని సహిస్తూ అలా మౌనం వహిస్తుంటాను! అందుకే నీవలా ఎప్పటికిఒక చోట ఉండకుండ గాలిలో తిరిగే కాగితంలా మారిచక్కర్లు కొడుతూంటావు! నేను మాత్రం ఉన్న చోటనే మాములు మనిషిల నిలబడి నలుగురి నాలుకల మీద నానుతుంటాను! - జవేరియా, 9849931255 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి