Sat 30 Oct 22:48:26.024511 2021 భూతకాల శకలాలపైభవిష్యత్తు శలాకలు!వర్తమాన శిఖరాలపైప్రవర్థమాన చిగురులు!! ఇనుప పంజరాలు ఉక్కు సంకల్పాలు! నెత్తురు మండే నెలవంకలు విధిరాతను తిరగరాసే విశ్వగవాక్షాలు!!కులమత అంతరాలను అంతమొందించిసంకుచిత అంతరాళాలను అధిగమించి!సమసమాజ సౌధ నిర్మాణానికిసమరశంఖం పూరించే సమతా సైనికులు!! మూఢవిశ్వాసాల మూతులు బిగించి సత్సాంప్రదాయాల సరణులు సాగించి! తార్కిక వివేచనతో తాదాత్మ్యం చెంది తరతరాలుగా వెలుగులు విరజిమ్మే గగనతారలు!!వ్యసనాల వాసనలు సోకకుండావ్యర్థ పిడివాదాలతో కాలయాపన చేయకుండాపాదరసంలా ప్రవర్తించిప్రగతి పాలకులుగా పరిణమించాలి!! శారీరక దఢత్వం సంతరించి మానసిక పరిణతిని సాధించి! నకారాత్మక నసలు వదిలి!యువశక్తి సకారాత్మక సత్క్రియలను సాక్షాత్కరించపూనాలి!! - కరిపె రాజ్ కుమార్, 8125144729 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి