ఆ యేలా సందమామ ముఖం మాడుసుకుంటే తెలుసుకోలేకపోయా ఎన్నెలోలే ఎలిగే నిన్ను చూసి నొచ్చుకున్నాడనిజి ఆ యేలా పూలన్నీ మూతి ముడుసుకుంటే తెలుసుకోలేకపోయా పులకన్నా సహజమైన నీ నవ్వులు చూసి కుళ్ళుకున్నాయనిజి ఆ యేలా గంధం అలిగి కూసుంటే తెలుసుకోలేకపోయా చుట్టూ పర్చుకున్న నీ పలుకుల ప్రేమ పరిమళం చూసి ఓర్వలేకపోయిందని ఈ యేలా మాత్రం స్పష్టంగా అర్ధమైతంది సుక్కోలే ఎలిగే నేను సీకట్లో సిక్కుకున్నది నీ తోడు లేకనేనని...