చేతి వేళ్ళ మీద లెక్కింప బడుతున్న అంకెలను తేదీలుగా మార్చుకున్న క్యాలెండర్ మట్టి గోడ మీద వేలాడుతూ కనబడని కాలాన్ని నెలలుగా విభజించి మనకు పరిచయం చేస్తుంది!
రెప్పపాటు సమయాన్ని క్షణాలుగ లెక్కించే ఇంట్లోని గంటల గడియారం వయ్యారంగా కదులుతూ మూడు ముళ్ళ మధ్య బంధించి మనుషులమైన మనకు అత్యంత విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటుంది!
ఆరు రుతువులు మూడు కాలాలుగ విడిపోయిన కాలం తన చుట్టూ తను పరిభ్రమిస్తూ కొత్త సంవత్సరంగా ఏర్పడి మనకు తెలియకుండానే ముందుకు తీసుకొని పోతుంది!
అందుకే మనతో రాని కాలంతో పాటు మనం నడవాలి కాలానికి తగ్గట్టు ఎదురీదడం నేర్చుకోవాలి!!