Sat 08 Jan 23:27:33.205205 2022 యాడికిబోయినవ్ బిడ్డా....కండ్లకానొస్తలేవు..మాయదారి కరోనంట....మసిజేత్తదంట...గడపదాటొద్దురంటే... మాటిన్కబోతివి...మూతిముక్కు గడ్డంగ గుడైన కట్టరంటే...దండీలుబస్కీలు తీసెటోన్ని...నాకే అడ్డులేందంటివితాకి సంపుతదంటే... నన్నుతాకి అదిసస్తదంటివిరాజైన, రైతైన, బడుగైన, అమీరైన... ఊకుంటలేదంటేనేను యమరాజుకే రాజునంటివి....దాని ఊసుతీస్తనంటివిఊరమ్మట బడితివి....ఇంటికి కాకుండైతివి...బొందిలో పానం.... బొరియపాల్టేసి...కంటిముంగల కట్టె ు- పాడెమీద కాలగా...అమ్మ అయ్యల కండ్ల నీరింకిపాయె...ఆలిబిడ్డల బతుకు బీడుపడిపాయె...అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళకు దూరమైపాయె...యాడికిబోయినవ్ బిడ్డా....కండ్లకానొస్తలేవు....- విశ్వనాథం (లలిత) 9701385013 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి